Telangana: పోలింగ్ కేంద్రంలోకి ఎవరెవరు వెళ్లవచ్చంటే..!

  • మరో 20 గంటల్లో తెలంగాణలో పోలింగ్
  • అనుమతించిన వ్యక్తులకు మాత్రమే లోపలి ప్రవేశం 
  • నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

మరో 20 గంటల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలోకి ఎవరెవరికి ప్రవేశం ఉంటుంది? ఎంతమంది ఒకేసారి వెళ్లవచ్చు? వంటి అంశాల విషయంలో ఎన్నికల సంఘం నియమావళిని విడుదల చేసింది. పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించిన వ్యక్తులకు మాత్రమే లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఉంటుంది.

ఈ జాబితాలో ఎన్నికల సంఘం ద్వారా అనుమతించిన వారు కొందరు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతించేవారు ఇంకొందరు ఉంటారు. ఒకేసారి ఎంత మంది ఓటర్లను అనుమతించాలన్న అధికారం ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతుల్లో ఉంటుంది. పోలింగ్‌ ఆఫీసర్లు, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు లోనికి వెళ్లవచ్చు.

ఆ నియోజకవర్గంలో పోటీ పడే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పోలింగ్‌ ఏజెంట్లు వెళ్లవచ్చు. ఓటు వేయడానికి వచ్చే వారు, చంకలో ఉండే చంటిబిడ్డలు, అంధులు, వృద్ధులకు తోడుగా వచ్చినవారు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నియమించబడిన వ్యక్తులు లోనికి వెళ్లొచ్చు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అధికారులు హెచ్చరించారు.

More Telugu News