jupudi prabhakar: సోదాల తర్వాత ప్రెస్ మీట్ పెడతానన్న జూపూడి.. కుదరదన్న పోలీసులు

  • జూపూడి ఇంటిలో పోలీసులు ఆకస్మిక సోదాలు
  • పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు
  • ప్రెస్ మీట్ పెట్టేందుకు అనుమతి నిరాకరణ

కూకట్‌పల్లిలోని తన ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాలపై ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమైన ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు విలేకరులతో మాట్లాడడం కుదరదని తేల్చి చెప్పారు. బాలాజీనగర్‌లోని ఆయన ఇంట్లో బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఇంటి వెనక నుంచి డబ్బు సంచులతో పరారవుతున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్ఎస్ నేతలు పట్టుకుని పోలీసులకు  అప్పగించారు. వారి నుంచి రూ.17.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా జూపూడి ఇంటి వద్దకు భారీగా చేరుకున్న టీఆర్ఎస్ నేతలు ఆయనను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడించేందుకు జూపూడి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల హడావిడి తగ్గిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. పారిపోతున్న వ్యక్తుల నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ఆ డబ్బులు ఎక్కడివి? ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? పోలీసులను చూసి ఎందుకు తరలిస్తున్నారు? అన్న దానిపై  పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News