Telangana: తెలంగాణ ద్రోహులతో కేటీఆర్ కు సంబంధాలు.. లగడపాటి ఆయన రహస్య స్నేహితుడు!: రేవంత్ రెడ్డి

  • లగడపాటి రాష్ట్రాన్ని ఆపడానికి ప్రయత్నించారు
  • ఆయనతో కేటీఆర్ రహస్యంగా చాట్ చేస్తున్నారు
  • ట్విట్టర్ లో మండిపడ్డ కాంగ్రెస్ నేత
తెలంగాణ ద్రోహులతో మంత్రి కేటీఆర్ కు రహస్య సంబంధాలు ఉన్నాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణను అడ్డుకోవడానికి తన ప్రాణాన్నీ, రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన లగడపాటి రాజగోపాల్ కేటీఆర్ కు రహస్య స్నేహితుడని వ్యాఖ్యానించారు. ఏపీ విభజన బిల్లు సందర్భంగా పార్లమెంటులో లగడపాటి చేసిన ‘పెప్పర్ స్ప్రే ఎపిసోడ్’ను రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రస్తావించారు. అలాంటి వ్యక్తితో కేటీఆర్ రహస్యంగా చాట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి ఈ మేరకు స్పందించారు.

అంతకుముందు కొడంగల్ లోని బొమ్మరాస్ పేట బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మరోసారి తనను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. రైతులెవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దనీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు 100 అడుగుల గోతిలో పాతిపెట్టే రోజులు ఎంతోదూరంలో లేవని వ్యాఖ్యానించారు.
Telangana
Congress
KTR
TRS
Andhra Pradesh
lagadapati
rajagopal
Revanth Reddy
secret friend

More Telugu News