KTR: తెలంగాణ మొత్తం ‘సారు’, ‘కారు’, ‘సర్కార్’ ట్రెండ్ నడుస్తోంది: కేటీఆర్

  • ప్రతిపక్షాలకు మక్కువ ఉంది ఓట్లపైనే ప్రజలపై కాదు
  • కుర్చీ కోసమే కాంగ్రెస్ పార్టీ నేతల కొట్లాట
  • కాంగ్రెస్, టీడీపీ ఒక్కటవడం సిగ్గుచేటు
తెలంగాణ మొత్తం ‘సారు’, ‘కారు’, ‘సర్కారు’ ట్రెండ్ నడుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలకు ఓట్లపై ఉన్న మక్కువ ప్రజలపై లేదని, కుర్చీ కోసమే కాంగ్రెస్ పార్టీ నేతల కొట్లాట అని విమర్శించారు. అతి త్వరలోనే ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తామని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఒక్కటవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

మెజార్టీలో మనకు మనమే పోటీ పడదాం: హరీష్ రావు

ఓటుతో మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు.  సిద్ధిపేటలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, మెజార్టీలో మనకు మనమే పోటీ పడదామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ని, టీఆర్ఎస్ కు మళ్లీ పట్టం కట్టాలని కోరారు. సిద్ధిపేటలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని నిర్మించుకున్నామని, మార్కెట్ యార్డు, రైతుబజార్, ఔటర్ రింగ్ రోడ్డు, కోమటి చెరువు చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని అన్నారు.
KTR
Telangana
vemulavada
t-congress

More Telugu News