ఆఖరి వ్యూహం... టీటీడీపీ, టీపీసీసీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
- ఎన్నికల వేళ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చ
- హాజరైన ప్రముఖ నేతలు
- పలు అంశాలపై దిశానిర్దేశం
తెలుగుదేశం పార్టీ నుంచి మండవ వెంకటేశ్వరరావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరుకాగా, కాంగ్రెస్ తరపున కుంతియా, మర్రి శశిధర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తాజాగా మారిన రాజకీయ సమీకరణాలు, ఎన్నికల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూలంకుషంగా చర్చించినట్టు సమాచారం. అవసరమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ రోజు సాయంత్రంతో ప్రచారం కూడా ముగుస్తున్న విషయం తెలిసిందే.