కేసీఆర్ సింహమైతే.. తీసుకెళ్లి జూలో పెట్టండి: వీహెచ్

04-12-2018 Tue 16:56
  • కేసీఆర్ ను సింహం అని కేటీఆర్, కవితలు అంటున్నారు
  • జూలో పెట్టమని జూ అధికారులకు లేఖ రాస్తా
  • కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవితలు సింహంగా అభివర్ణిస్తున్నారని... ఆయన నిజంగా సింహమైతే తీసుకెళ్లి జూలో పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కేసీఆర్ ను జూలో పెట్టాలని జూ అధికారులకు లేఖ రాస్తానని చెప్పారు.

 తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని, గతంలోని దొరల పాలనను గుర్తుకు తెస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయని... ఒక ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ అయితే, మరో ప్రభుత్వానికి అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి అని అన్నారు.