భారీ భద్రత మధ్య రేవంత్ ను కొడంగల్ కు తరలించిన పోలీసులు
- జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి కొడంగల్ కు తరలింపు
- నిన్న అర్ధరాత్రి రేవంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- రేవంత్ ను విడుదల చేయాలని ఆదేశించిన ఎన్నికల సంఘం
కేసీఆర్ సభ నేపథ్యంలో, ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తెల్లవారుజామున ఆయనను అరెస్ట్ చేసి, జడ్చర్లకు తరలించారు. రేవంత్ ను విడుదల చేయాలని కాసేపటి క్రితమే డీజీపీని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశించారు.