ఆర్డీఎస్ లో నీళ్లు ఎలా పారుతున్నాయో.. టీఆర్ఎస్ కు ఓట్లు అలా పారాలి: సీఎం కేసీఆర్
- ఆలంపూర్ కు డిగ్రీ కాలేజ్, ఫైర్ స్టేషన్ తీసుకొస్తాం
- ప్రభుత్వ ఆసుపత్రిలో వందపడకలు ఏర్పాటు చేస్తాం
- హక్కుల కోసం పోరాడే ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్
ఆలంపూర్ లో ప్రజలు కోరిన విధంగా డిగ్రీ కాలేజ్, ఫైర్ స్టేషన్ తీసుకొస్తామని చెప్పారు. మూడు లేదా నాలుగు నెలల్లో వీటిని అమలు చేస్తామని, ఇక్కడి ఆసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా మారుస్తామని అన్నారు. భగవంతుడి దయ వల్ల తెలంగాణకు సంపదకు తక్కువ లేదని, అన్నీ అమలు చేస్తామని అన్నారు. హక్కుల కోసం పేగులు తెగేలా కొట్లాడే ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ కనుక, తమ అభ్యర్థి అబ్రహాంను గెలిపించాలని కోరారు.