Kajal Agarwal: ప్రస్తుతం పెళ్లి గురించిన ఆలోచన లేదు: కాజల్

షార్ట్స్‌లో చూడండి
ఆ మధ్య కాజల్ కెరియర్ గ్రాఫ్ కాస్త మందగించినా, ఆ తరువాత మళ్లీ పుంజుకుంది. వరుస అవకాశాలతో ఆమె దూసుకుపోతోంది. అటు సీనియర్ హీరోల సరసన .. ఇటు యువ హీరోల జోడీగా ఆమె ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'కవచం'.. ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్రకి చాలా ప్రాముఖ్యత వుంది .. అందువల్లనే చేయడానికి అంగీకరించాను. నా పాత్రకి మంచి గుర్తింపు వస్తుందనే బలమైన నమ్మకం వుంది. తమిళ రీమేక్ గా చేసే 'క్వీన్' .. తెలుగులో తేజ దర్శకత్వంలో చేసే సినిమాలు నాకు మరింత గుర్తింపును తెచ్చిపెడతాయి. ఇక 'భారతీయుడు 2'లో కమల్ సరసన చేసే ఛాన్స్ రావడాన్ని నేనే నమ్మలేకపోతున్నాను. అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు .. నాకూ చేసుకోవాలనే వుంది .. అయితే చేతినిండా సినిమాలు వున్నాయి .. అందువలన పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు" అని చెప్పుకొచ్చింది. 
Go Back to Shorts
Kajal Agarwal

More Telugu News