sundaram master: నెలకి 40 రూపాయల జీతం .. 10 రూపాయలు పెట్టి డాన్స్ నేర్చుకున్నాను: డాన్స్ మాస్టర్ సుందరం

  • సినిమాల్లో చేయాలనేది ఆసక్తి 
  • చేసిన ప్రయత్నాలు ఫలించలేదు 
  • 'చందమామ' ప్రెస్ లో చేరాను

వివిధ భాషా చిత్రాలకి డాన్స్ మాస్టర్ గా పనిచేసిన సుందరం మాస్టర్ .. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన కుమారులైన ప్రభుదేవా .. రాజు సుందరం .. ప్రసాద్ ముగ్గురూ మంచి డాన్సర్లే. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.

"దూరం నుంచి చూస్తే సినిమా అనేది చాలా అందంగా కనిపిస్తుంది. దగ్గరికి వచ్చి చూసిన తరువాత అక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయనేది నాకు అర్థమైంది. ఎలాగైనా చిత్ర పరిశ్రమలోకి రావాలనే పట్టుదలతో నేను చాలా ప్రయత్నాలు చేశాను గానీ ఫలించలేదు. వాహినీ స్టూడియోస్ వారు 'చందమామ' ప్రెస్ నడుపుతుండేవారు. ఆ ప్రెస్ లో పేపర్లు అందించేవాడిగా పనిచేశాను. నెలకి 40 రూపాయలు జీతంగా ఇచ్చేవారు. ఆ 40 రూపాయల్లో నుంచి ఒక 10 రూపాయలు పెట్టి నాకు ఇష్టమైన డాన్స్ ను నేర్చుకునేవాడిని" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News