టీఆర్ఎస్ కు ఎదురు లేదని చెప్పిన మరో సర్వే!

03-12-2018 Mon 20:42
  • టీఆర్ఎస్ కు 94-104 సీట్లు వస్తాయన్న సర్వే 
  • ప్రజాకూటమికి 16 నుంచి 21 సీట్లు
  • ఎంఐఎంకు 7 సీట్లు, బీజేపీకి 1 నుంచి 2 సీట్లు 

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని మరో సర్వే చెప్పింది. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) సర్వేలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. టీఆర్ఎస్ కు 94-104 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ప్రజాకూటమికి 16 నుంచి 21 సీట్లే లభిస్తాయని, ఎంఐఎంకు 7 సీట్లు, బీజేపీకి 1 నుంచి 2 సీట్లు, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించే అవకాశాలున్నట్టు సీపీఎస్ సర్వే అంచనా. నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య తెలంగాణలోని నియోజకవర్గాల్లో సీపీఎస్ శాంపిల్స్ సేకరించిందని, అభ్యర్థి, పార్టీని లెక్కలోకి తీసుకుని అభిప్రాయ సేకరణ చేసినట్టు సమాచారం.