వేల కోట్లను దోచేసిన కేసీఆర్ ను అందరూ తిరస్కరించండి: డీకే అరుణ
- తెలంగాణను ఇచ్చింది సోనియాగాంధీనే
- టీఆర్ఎస్ కారులో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే స్థానం ఉంది
- ధనిక రాష్ట్రం తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు
వేల కోట్ల రూపాయలను దోచేసిన కేసీఆర్ ను రాష్ట్ర ప్రజలంతా తిరస్కరించాలని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప మరెవరూ బాగుపడలేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన అంబాసిడర్ కారు రోడ్ల మీద కనిపించడం లేదని... ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కూడా ఉండదని తెలిపారు. టీఆర్ఎస్ కారులో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే స్థానముందని చెప్పారు. ఇసుక మాఫియా, భూకబ్జాలకు టీఆర్ఎస్ నేతలు పాల్పడుతున్నారని అరుణ ఆరోపించారు.