లగడపాటి రాజగోపాల్ సర్వే ఓ బక్వాస్ సర్వే: టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఫైర్

02-12-2018 Sun 14:59
  • ప్రజలను తికమక పెట్టాలని లగడపాటి చూస్తున్నారు
  • కాంగ్రెస్- టీడీపీ మధ్య వారధిగా ఉండాలని యత్నం 
  • మేము మళ్లీ అధికారంలోకొస్తామని వారికి భయం  

లగడపాటి రాజగోపాల్ సర్వే ఓ బక్వాస్ సర్వే అంటూ టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను తికమక పెట్టేందుకు లగడపాటి చూస్తున్నారని, అందుకే, ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య వారధిగా పని చేసేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  

తెలంగాణకు పరోక్షపాలకుడు కావాలని చంద్రబాబు కుట్ర

ఏపీ సీఎం చంద్రబాబుపై వినోద్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు తాను పరోక్షపాలకుడు కావాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలను తిప్పికొట్టారు. చంద్రబాబు కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు.