Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సినిమాల వల్ల భయం పోయిందట!
  • ఆ యాడ్ గురించి మహేశ్ బాబు 
  • ఫిబ్రవరిలో చైనాకు రజనీ చిత్రం 

*  సినిమాల వల్ల తనకు జంతువులంటే భయం పోయిందని అంటోంది అందాలతార కాజల్. "అమ్మో, గతంలో యానిమల్స్ అంటే చచ్చేంత భయం. సినిమాల్లోకి వచ్చాక వాటితోనే కొన్ని సార్లు షూటింగ్ చేయడం వల్ల ఆ భయం పోయింది. ఆ విధంగా సినిమా నాకు హెల్ప్ చేసింది' అని చెప్పింది.
*  మహేశ్ బాబు నటించిన థమ్సప్ వాణిజ్య ప్రకటన పలువురుని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై మహేశ్ మాట్లాడుతూ, ఈ యాడ్ ను కౌలాలంపూర్ అడవుల్లో చిత్రీకరించామని చెప్పాడు. ఈ కమర్షియల్ షూటింగ్ తనకు ఒక ఛాలెంజ్ గా, ఒక సాహసంగా నిలిచిందని చెప్పాడు.
*  రజనీ, శంకర్ ల కాంబినేషన్లో వచ్చిన '2.ఓ' చిత్రం విడుదలైన ప్రతి చోటా విజయదుందుభి మోగిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు భాషల్లోకి దీనిని అనువదించి రిలీజ్ చేస్తున్నారు. ఇక భారతీయ చిత్రాలకు విశేష ఆదరణ లభించే చైనాలో వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

More Telugu News