Kodandaram: పొత్తు పేరిట కోదండరామ్ కు కోదండమేశారు: మంత్రి హరీశ్ రావు వ్యంగ్యాస్త్రం

  • కరెంట్ అడిగితే కాల్చి చంపించినవి కాంగ్రెస్, టీడీపీలు
  • బాబుతో కోదండరామ్ చేతులు కలపడం హాస్యాస్పదం
  • మాట తప్పినోళ్లు ప్రజా కూటమిగా ముందుకొచ్చారు!
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పొత్తు పేరిట కోదండరామ్ కు కాంగ్రెస్ నాయకులు కోదండమేశారని మంత్రి హరీశ్ రావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పౌరహక్కులను ఉల్లంఘించిన చంద్రబాబుతో కోదండరామ్ చేతులు కలపడం హాస్యాస్పదమని అన్నారు. నాడు తెలంగాణలో కరెంట్ కావాలని అడిగితే కాల్చి చంపించిన కాంగ్రెస్, టీడీపీలను తరిమికొట్టాలని ప్రజలకు సూచించారు. మాట తప్పినోళ్లు ప్రజా కూటమిగా ముందుకొచ్చారని విమర్శించారు. నాడు తండాల్లో ఆడపిల్లలను అమ్ముకునే దుస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. 
Kodandaram
Harish Rao
t-congress
Chandrababu

More Telugu News