vijay devarakonda: 'డియర్ కామ్రేడ్'తో బిజీగా విజయ్ దేవరకొండ

  • విభిన్న కథా చిత్రంగా 'డియర్ కామ్రేడ్'
  • కాకినాడలో జరుగుతోన్న షూటింగ్
  • దర్శకుడిగా భరత్ కమ్మ పరిచయం  

'టాక్సీవాలా' అనూహ్యమైన విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సక్సెస్ తెచ్చిన ఆనందంతో ఆయన తన తదుపరి చిత్రమైన 'డియర్ కామ్రేడ్' షూటింగులో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు కాకినాడలోని మెడికల్ కాలేజ్ లో జరుగుతోంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. అందువలన కాలేజ్ నేపథ్యంలో సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజులపాటు అక్కడే షూటింగు జరపనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోను విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. భరత్ కమ్మ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తన కెరియర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో విజయ్ దేవరకొండ వున్నాడు. 

More Telugu News