TRS: మా బాస్ ఒప్పుకోడు కానీ... !: టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి

  • నారాయణ్ పేట్ లో మా అభ్యర్థి విజయం ఖాయం
  • రెండో స్థానంలో శివకుమార్ రెడ్డి ఉంటారు
  • మూడో స్థానంలో బీజేపీ, నాల్గో స్థానంలో కాంగ్రెస్  
నారాయణపేట్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి శివకుమార్  గెలవబోతున్నారంటూ మాజీ ఎంపీ లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏబీఏన్’తో ఆయన మాట్లాడుతూ, నారాయణ్ పేట్ ఇండిపెండెంట్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ వాడేనని, గతంలో ఓటమి పాలైన ఆయన, కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోటీ చేసేందుకు చాలా ప్రయత్నం చేసినా ఫలించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ శివకుమార్ రెడ్డికి లభించలేదన్న సానుభూతి ఉందని అన్నారు.

తమ బాస్ ఒప్పుకోడు కానీ... తమ అభ్యర్థులపై కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ మార్చలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, టీఆర్ఎస్ పై ఎక్కడా వ్యతిరేకత లేదని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, నారాయణ్ పేట్ లో తమ అభ్యర్థి రాజేందర్ రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శివకుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉంటారని, మూడో స్థానంలో బీజేపీ, నాల్గో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
TRS
mp jitender reddy
ex mp
lagadapati

More Telugu News