K Kavitha: కోదండరాం లాంటి వాళ్లు చేసే విమర్శలు వాస్తవం అయిపోవు: కవిత

  • ప్రజలేమంటున్నారో చూడాలి
  • కేసీఆర్‌ను ప్రజలు విశ్వసిస్తున్నారు
  • పనులు నచ్చకుంటే ప్రజలే ఓడించేవారు
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలపై గుప్పిస్తున్న విమర్శలపై ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ.. కోదండరాం విషయం పక్కన పెట్టి తమ పార్టీ గురించి ప్రజలేమంటున్నారో చూడాలన్నారు. కేసీఆర్ చేసినవన్నీ సరైనవని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆమె తెలిపారు.

పార్టీ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకూ ఎన్నో ఎన్నికలు వచ్చాయని.. ప్రతిసారి ప్రజల తీర్పు టీఆర్ఎస్ వైపే ఉందన్నారు. తమ పనులు నచ్చకుంటే ప్రజలే ఓడించేవారన్నారు. ప్రజలిచ్చిన తీర్పుతో తాము మరింత ముందుకు కొనసాగుతున్నామని కవిత పేర్కొన్నారు. తమకు అనుకూలంగా ప్రజలున్నప్పుడు కోదండరాం లాంటి వాళ్లు చేసే విమర్శలు వాస్తవమైపోవన్నారు.
K Kavitha
Kodandaram
KCR
TRS
Elections

More Telugu News