Telangana: తెలంగాణలో హంగ్ అసెంబ్లీకి అవకాశమే లేదు: లగడపాటి రాజగోపాల్

  • ఎన్నికల్లో ఓ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది
  • ఏ పార్టీకి అన్న విషయం ఇప్పుడే చెప్పను
  • డిసెంబర్ 7న వెల్లడిస్తా
తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశమే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. ‘ఏబీఎన్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పిన ఆయన, ఏ పార్టీకి మెజార్టీ వస్తుందన్న విషయాన్ని మాత్రం డిసెంబర్ 7న వెల్లడిస్తానని అన్నారు. నమ్మేవాళ్లు నమ్ముతారు, నమ్మని వాళ్లు నమ్మరని చెప్పిన లగడపాటి, ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి మాత్రం రాదని చెప్పారు.

కాగా, వెకిలి, మకిలీ సర్వేలను నమ్మొద్దంటూ సీఎం కేసీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యల గురించి లగడపాటిని ప్రశ్నించగా, ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవి కాదనుకుంటున్నానని అన్నారు. తన సర్వేను ఇంతవరకూ రిలీజ్ చేయలేదని, కేసీఆర్ వ్యాఖ్యల్లో తన పేరును ఎక్కడా ప్రస్తావించ లేదన్న విషయాన్ని గమనించాలని అన్నారు.
Telangana
kcr
lagadapati
election survey

More Telugu News