kangana: 'మణికర్ణిక'కి దర్శకత్వం వహించడం పెద్ద కష్టంగా అనిపించలేదు: కంగనా రనౌత్

  • దర్శకత్వం చేయడంలో అనుభవం వుంది 
  • కష్టపడటం నాకు అలవాటే 
  • సమస్యలను అధిగమించాను

బాలీవుడ్లో భారీ చారిత్రక చిత్రంగా 'మణికర్ణిక' ను సెట్స్ పైకి తీసుకెళ్లారు. కంగనా రనౌత్ ప్రధానమైన పాత్రను ధరించిన ఈ సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించాడు. అయితే, చాలావరకూ చిత్రీకరణ పూర్తయిన తరువాత మనస్పర్థలు రావడంతో, క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి పక్కకి తప్పుకున్నాడు. దాంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దర్శకత్వ పనులను కంగనా చక్కబెట్టింది. ఈ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.

"దర్శకత్వం చేయడం నాకేం కొత్తకాదు .. నా 23వ యేటనే ఒక లఘు చిత్రాన్ని రూపొందించాను .. అందుకోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశాను. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఒక్కసారిగా స్వీకరించడం వలన కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటిని నేను అధిరోహించగలిగాను. నా ప్రతి సినిమాకి నేను చాలా కష్టపడతాను .. ఈ సినిమాకి అంతకంటే కొంచెం ఎక్కువగా కష్టపడవలసి వచ్చిందంతే. అంతకి మించి నాకు పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు" అని చెప్పుకొచ్చింది.  

More Telugu News