ఆంధ్రాలో టీడీపీ నేతలు ‘ఆలీబాబా-40 దొంగలు’గా తయారయ్యారు!: బీజేపీ నేత జీవీఎల్
- సుజనా, సీఎం రమేశ్ పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదుచేశా
- అవినీతిని చంద్రబాబు పట్టించుకోవడం లేదు
- విజయవాడ మీడియా సమావేశంలో జీవీఎల్ వెల్లడి
రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత లేదని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. ఆంధ్రాలో తన బినామీలను కాపాడుకునే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ‘ఆలీబాబా 40 దొంగల్లా’ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని టీడీపీ నేతలు దోచేస్తుంటే బీజేపీ ప్రశ్నించకుండా ఉండాలా? అని ఘాటుగా స్పందించారు. ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారనీ, కానీ నేడు అదే పార్టీని చంద్రబాబు రాహుల్ గాంధీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు.