kamal: 'భారతీయుడు 2'లో వెన్నెల కిషోర్ కి చోటు?

  • ఈ రోజే థియేటర్లకు వచ్చిన '2.ఓ'
  • త్వరలో సెట్స్ పైకి 'భారతీయుడు 2'
  • ముఖ్య పాత్రల్లో దుల్కర్ - శింబు  

శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్ల దగ్గర సందడి మొదలైంది. ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తితో ప్రేక్షకులు వుండగా, సంచలన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో శంకర్ వున్నాడు. ఆ నమ్మకంతోనే 'భారతీయుడు 2' సినిమాకి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగేలా శంకర్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే కమల్ లుక్ ను సెట్ చేసిన ఆయన, ముఖ్యమైన పాత్రలకి గాను దుల్కర్ సల్మాన్ .. శింబులను తీసుకున్నారు. ఈ సినిమాలో కమెడియన్ పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత ఉందని సమాచారం. ఈ పాత్రకి గాను ఆయన వెన్నెల కిషోర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమా అంతా ఈ పాత్ర కనిపిస్తుందట. ఈ సినిమాతో వెన్నెల కిశోర్ రేంజ్ మరింత పెరగబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.     

More Telugu News