Tanikella Bharani: తెలంగాణలో విజయం సాధించేది టీఆర్ఎస్సే: తనికెళ్ల భరణి

  • యూసఫ్ గూడలో నివాసం ఉంటున్న తనికెళ్ల భరణి
  • ఆయన ఇంటికి వెళ్లి కలిసిన కార్పొరేటర్ సంజయ్ గౌడ్
  • కేసీఆర్ మరోసారి సీఎం అవుతారన్న భరణి
తెలంగాణకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ తరఫున టీఆర్ఎస్ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ వెళ్లి ఆయన్ను కలిశారు. యూసఫ్ గూడ డివిజన్ ప్రగతినగర్ లో తనికెళ్ల నివాసం ఉండగా, సంజయ్ వెళ్లారు.

ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు జనాదరణ లభించిందని అన్నారు. భారీ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. తెలంగాణలో విజయం సాధించేది టీఆర్ఎస్సేనని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారన్న నమ్మకం ఉందని తనికెళ్ల భరణి తెలిపారు.
Tanikella Bharani
Yousufguda
Sanjay Goud
kcr
Telangana

More Telugu News