balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ కోసం కెమెరా ముందుకు వచ్చిన క్రిష్

  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • కేవీ రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్ 
  • జనవరి 9వ తేదీన విడుదల    

ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలోని ముఖ్య పాత్రలకి తీసుకున్న క్రేజీ ఆర్టిస్టుల కారణంగా ఈ ప్రాజెక్టు మరింత భారీతనాన్ని సంతరించుకుంది. ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తోన్న క్రిష్, ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఆయన దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో కనిపించనున్నారు.

ఎన్టీఆర్ కథానాయకుడిగా కేవీ రెడ్డి ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించారు. ఈ ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం వుంది. తిరుగులేని దర్శకుడిగా వెలుగొందిన కేవీ రెడ్డి, చివరిదశలో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకి ఎన్టీఆర్ సాయం చేశారు. ఆ సన్నివేశాలనే ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. 'మహానటి' సినిమాలో దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో క్రిష్ కనిపించారు. ఈ సారి తన దర్శకత్వంలో అదే పాత్రను ఆయన పోషిస్తుండటం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.  

More Telugu News