కేసీఆర్ కుటుంబానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప వేరే పని లేదు: రేవంత్
- గుడిలో ప్రమాణం చేయాలి
- కాంట్రాక్టులో కమీషన్ తీసుకోలేదా?
- కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుండంలో మునిగి గుడిలో ప్రమాణం చేయాలని కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. సవాల్‌ను స్వీకరించకుంటే కమీషన్ తీసుకున్నట్టు ఒప్పుకున్నట్టేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన తరుణం వచ్చిందని.. కాంగ్రెస్‌ను గెలిపించి ఆమెకు బహుమతిగా ఇవ్వాలన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప వేరే పని లేదన్నారు. కేసీఆర్ ఉద్యోగం ఊడితే వంద రోజుల్లో యువతకు లక్ష ఉద్యోగాల కల్పన సాధ్యమేనని రేవంత్ తెలిపారు.