Gujarat: పూటుగా తాగి డెలివరీ చేసిన వైద్యుడు.. తల్లీబిడ్డల మృతి

  • గుజరాత్‌లో ఘటన
  • అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు షాక్
  •  మద్యం మత్తులో ఉన్న వైద్యుడు
పూటుగా తాగి డెలివరీ చేసి తల్లీబిడ్డల మృతికి కారణమైన వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పురిటినొప్పులతో బాధపడుతున్న కమినిబెన్ చంచియ (22)ను బోటాడ్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సోనావాలా ఆసుపత్రికి తీసుకొచ్చారు.

సోమవారం రాత్రి డాక్టర్ పీజే లఖాని ఆమెకు డెలివరీ చేశారు. ఆయన నిర్లక్ష్యం కారణంగా డెలివరీ అయిన కాసేపటికే నవజాత శిశువు మృతి చెందగా, ఆ కాసేపటికే తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోవడానికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. మద్య నిషేధ చట్టం కింద వైద్యుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి రక్త నమూనాలను పరీక్షలకు పంపారు.
Gujarat
Hospital
drunk doctor
newborn child
Botad

More Telugu News