Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ వాయిదా!

  • రెండు వారాల పాటు వాయిదా
  • నేడు కొత్త షెడ్యూల్
  • అభ్యర్థుల కోరిక మేరకేనన్న మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ ప్రకటించిన డీఎస్సీ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అభ్యర్థుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. షెడ్యూల్ విడుదలైన తరువాత, పరీక్షకు సమయం తక్కువగా ఉందని, తమకు ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చిన మేరకు, సీఎంతో చర్చించి, రెండు వారాలు వాయిదా వేశామని అన్నారు. కొత్త షెడ్యూల్ ను నేడు ప్రకటిస్తామని చెప్పారు.

కాగా, డీఎస్సీలో అన్ని పోస్టులూ కలిపి 7,729 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, ఆరు లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆన్ లైన్లో పరీక్ష నిర్వహించాలా? లేక ఆఫ్ లైన్ లో నిర్వహించాలా? అన్న విషయంపైనా విద్యాశాఖ ఇంకా నిర్ణయించుకోలేదు.
Andhra Pradesh
DSC
Ganta Srinivasa Rao
Postpone

More Telugu News