Kalinga Sena: అమ్మో.. ఒడిశాకు చెడ్డపేరు వస్తుంది.. నటుడు షారూక్‌ ముఖంపై ఇంకు చల్లబోం: కళింగ సేన

  • షారూక్‌ను వెంటాడుతున్న 17 ఏళ్ల నాటి అశోక సినిమా
  • ఒడిశా చరిత్రను వక్రీరించారని కళింగ సేన ఆరోపణ
  • ప్రభుత్వం, హాకీ ఇండియా చొరవతో వెనక్కి తగ్గిన కళింగ సేన

బాలీవుడ్ స్టార్ నటుడు షారూక్ ఖాన్‌పై ఇంకు చల్లాలన్న తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఒడిశాకు చెందిన కళింగ సేన ప్రకటించింది. నేడు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పురుషుల హాకీ ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమానికి షారూక్ హాజరుకాబోతున్నాడు.

17 ఏళ్ల క్రితం షారూక్ నటించిన అశోక సినిమాలో ఒడిశా చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ నేడు ఒడిశాకు రానున్న షారూక్ ముఖంపై ఇంకు చల్లి, నల్ల జెండాలు చూపి నిరసనను వ్యక్తం చేయనున్నట్టు కళింగ సేన ఇది వరకే ప్రకటించింది.

అయితే, హాకీ ఇండియా అధ్యక్షుడు మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో షారూక్ ముఖంపై ఇంకు చల్లాలన్న తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టు కళింగ సేన చీఫ్ హేమంత్ రథ్ తెలిపారు. హాకీకి విశేష మద్దతు పలుకుతున్న షారూక్‌ను రాష్ట్రానికి పిలిచి అవమానించడం వల్ల ఒడిశాకే కాక మొత్తం దేశానికే చెడ్డపేరు వస్తుందని, కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతూ ముస్తాక్ అహ్మద్ కళింగ సేన చీఫ్‌కు ఈ-మెయిల్ పంపారు. దీంతో హేమంత్ రథ్ తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు.

More Telugu News