USA: ముంబై ఉగ్రదాడి సూత్రధారుల సమాచారం ఇవ్వండి.. రూ.35 కోట్లు అందుకోండి!: అమెరికా బంపర్ ఆఫర్

  • నేటితో ముంబై దాడులకు పదేళ్లు పూర్తి
  • 166 మందిని బలిగొన్న పాక్ ఉగ్రవాదులు
  • నిందితులపై ఇంకా చర్యలు తీసుకోని పాక్

2008, నవంబర్ 26.. భారతీయులు మరచిపోలేని రోజు ఇది. పాకిస్తాన్ నుంచి అక్రమంగా పడవలో భారత్ లోకి చొరబడ్డ 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. 166 మందిని దారుణంగా హత్య చేశారు. ఈ సందర్భంగా రంగంలోకి దిగిన ఎన్ఎస్జీ కమాండోలు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. భారత తీరప్రాంత భద్రతలోని లోపాలను తేటతెల్లం చేసిన ఈ దర్ఘటనకు నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది.

ముంబైపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు అమెరికా పౌరులు సైతంం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దాడికి కుట్ర పన్నినవారు, సహకరించినవారికి శిక్ష పడేలా అవసరమైన సమాచారం తెలిపినవారికి రూ.35.21 కోట్లు (5మిలియన్ డాలర్లు) అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడికి లష్కరే నేతలు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ, హమ్జాలు కుట్ర పన్నినట్లు భారత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. వీరి పాత్రకు సంబంధించి సాక్ష్యాలను భారత్ పాకిస్తాన్ కు సమర్పించినా, ఆ దేశం ఉగ్రమూకలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

More Telugu News