చరణ్ సొంత బ్యానర్లో అఖిల్ సినిమా!
- వెంకీ అట్లూరి నుంచి 'మిస్టర్ మజ్ను'
- అఖిల్ 4వ సినిమాపై ఆసక్తి
- దర్శకుడిగా తెరపైకి బోయపాటి పేరు
అఖిల్ 4వ సినిమాకి బోయపాటి దర్శకుడిగా వ్యవహరించనున్నాడనీ, ఈ సినిమా చరణ్ సొంత బ్యానర్లో రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలోనే చరణ్ 'వినయ విధేయ రామ' చేస్తున్నాడు. ఈ సినిమా సెట్లోనే బోయపాటి .. చరణ్ కలిసి అఖిల్ ప్రాజెక్టును సెట్ చేశారని చెప్పుకుంటున్నారు. తన బ్యానర్లో ఇతర హీరోల సినిమాలను కూడా నిర్మిస్తానని ఆరంభంలోనే చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే.