ayodya: అయోధ్యలో రేపు వీహెచ్‌పీ, శివసేన ర్యాలీ, సభ.. టెన్షన్‌ టెన్షన్‌!

  • వివాదాస్పద ప్రాంతంలో రాముడి మందిరం నిర్మించాలని రెండు పక్షాల డిమాండ్‌
  • ఐదు ప్రత్యేక  రైళ్లలో భారీగా తరలి వస్తున్న జనం
  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

అయోధ్యలో మళ్లీ టెన్షన్‌ పెరుగుతోంది. రామ మందిరం నిర్మాణం డిమాండ్‌ చేస్తూ వీహెచ్‌పీ, శివసేనలు పలు కార్యక్రమాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతుండడంతో క్షణక్షణానికి పరిస్థితులు మారుతున్నాయి. వివాదాస్పద బాబ్రీ మసీదు స్థలంలో రామమందిరం నిర్మించాలన్న డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌ ధర్మ సభ నిర్వహిస్తుండడం, ఈ సభకు లక్షలాది మంది తరలి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.  వీహెచ్‌పీ సభకు దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీహెచ్‌పీతోపాటు శివసేన కలిసి ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ఈ కార్యకమ్రానికి శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే కూడా హాజరవుతున్నారు. సరయూ నదిలో జరిగే హారతి కార్యక్రమంలో ఉద్దవ్‌ పాల్గొంటారు.

More Telugu News