Andhra Pradesh: ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలు తెరవలేదు.. జగన్ వద్ద శిఖబడి రైతుల ఆవేదన!

  • విజయనగరంలో జగన్ ప్రజాసంకల్పయాత్ర
  • నేడు జీయమ్మ వలస నుంచి ప్రారంభం
  • జగన్ ను కలుసుకున్న రైతులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ 304వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నేడు ప్రారంభమైంది. విజయనగరం జిల్లాలోని జీయమ్మ వలస మండలంలోని శిఖబడి క్రాస్‌ నుంచి ఉదయం 7.30 గంటలకు జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాలామంది ప్రజలు జగన్ ను కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు.

శిఖబడి క్రాస్ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర బిజేపురం, గెద్ద తిరువాడ, యిటిక, కుందర తిరువాడ క్రాస్‌, చిన్న కుదమ క్రాస్‌ మీదుగా తురకనాయుడు వరకూ సాగనుంది. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా శిఖబడి గ్రామ రైతులు జగన్ ను కలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వం పంటల కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

దళారులకు పంటలను తక్కువ ధరలకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తోందని వాపోయారు. కాగా మన ప్రభుత్వం వచ్చాక రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్.. పాదయాత్రలో ముందుకు కదిలారు.

More Telugu News