డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కాంగ్రెస్ బంపర్ హామీ!
- ‘వన్ టైం రెంట్ రీయింబర్స్‌మెంట్’ కింద రూ. 50 వేలు
- ఏడాదిలోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు
- కేసీఆర్‌ను బొందపెట్టే సమయం ఆసన్నమైంది
కేసీఆర్ కుటుంబం మినహా మిగతా టీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒకటి రెండు రోజుల్లోనే ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయన్నారు. కేసీఆర్ తెలంగాణ ముసుగు వెనక ఉన్న అధికార, ధన దాహం ఇన్నాళ్లకు బయటపడిందని, కేసీఆర్ నియంతృత్వం నుంచి విముక్తి పొందేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. మోసగాడైన కేసీఆర్‌ను బొందపెట్టే సమయం ఆసన్నమైందని ఉత్తమ్ కుమార్ అన్నారు.