పంచెకట్టులో ఆకట్టుకుంటున్న చెర్రీ
- సినిమాపై అంచనాలను పెంచేసిన టీజర్
- కార్తీక పౌర్ణమి సందర్భంగా పోస్టర్
- సంక్రాంతికి కలుద్దామంటూ క్యాప్షన్
ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. పంచెకట్టులో చెర్రీ హారతి తీసుకుంటూ కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్‌కు ‘కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. సంక్రాంతికి కలుద్దాం’ అనే క్యాప్షన్‌ను చిత్రబృందం జత చేసింది. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.