chaitu: 'మజిలి' కోసం మరో హీరోయిన్ ను ఎంపిక చేసిన సమంత!

  • శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలి'
  • రెండవ హీరోయిన్ గా దివ్యాన్షా
  • ఈ నెల 26 నుంచి మరో షెడ్యూల్    

నాగచైతన్య .. సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలి' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ ఈ సినిమాలో సమంత మాత్రమే కథానాయిక అనుకున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందనేది తాజా సమాచారం .. ఆమె పేరే 'దివ్యాన్షా కౌశిక్'.

ఈ సుందరి ఈ సినిమాలో గెస్టుగా మెరిసిపోతుందనుకుంటే పొరపాటే. ఫస్టాఫ్ అంతా కూడా చైతూతో ఆడిపాడేది ఈ అమ్మడేనని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఆడిషన్ జరగగా, సమంతనే ఈ అమ్మాయిని ఎంపిక చేసిందట. ఈ నెల 26వ తేదీ నుంచి మరో షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్లో దివ్యాన్షా కౌశిక్ జాయిన్ కానుందని చెబుతున్నారు. ఈ అమ్మాయి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.     

More Telugu News