భీకర ఎన్ కౌంటర్... ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!
- ఈ ఉదయం అనంతనాగ్ సమీపంలో ఎన్ కౌంటర్
- ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో వెళ్లిన సైన్యం
- భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
సైన్యం ఎన్ కౌంటర్ ను ప్రారంభించగా, ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారని, ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామని, అదనపు బలగాలను రప్పించామని అన్నారు. మృతి చెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.