'96' రీమేక్ పైనే బన్నీ దృష్టి .. హీరోయిన్ గా సమంత?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'96' రీమేక్ పైనే బన్నీ దృష్టి .. హీరోయిన్ గా సమంత?

  • తమిళంలో హిట్ కొట్టిన '96'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
  • తెలుగుకి కూడా తమిళ మూవీ దర్శకుడే    
అల్లు అర్జున్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండనుంది. అందుకు సంబంధించిన కథపైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. కథ ఒక కొలిక్కి వచ్చి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కావడానికీ, మిగతా పనులు చక్కబెట్టుకుని సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం వుంది. ఈలోగా '96' రీమేక్ లో చేసేయాలనే బలమైన నిర్ణయంతో అల్లు అర్జున్ వున్నట్టుగా సమాచారం. '96' తమిళ సినిమా చూసిన దగ్గర నుంచి అల్లు అర్జున్ ధ్యాస అంతా కూడా ఆ సినిమాపైనే వుంది. తన కెరియర్లో వైవిధ్యభరితమైన సినిమా అవుతుందని భావించిన అల్లు అర్జున్ ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఒక నెల రోజుల్లోనే తన పోర్షన్ పూర్తి చేయవచ్చనే ఉద్దేశంతో, దిల్ రాజుతో చర్చలు జరిపినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్న దిల్ రాజు, తమిళ మూవీ చేసిన ప్రేమ్ కుమార్ కే తెలుగు వెర్షన్ బాధ్యతలను అప్పగించారు. అల్లు అర్జున్ - దిల్ రాజు ఇద్దరూ కూడా కథానాయిక సమంత అయితే బాగుంటుందని అంటున్నారట. దర్శకుడు మాత్రం త్రిషనే తీసుకుందామని అంటున్నాడట.   
allu arjun
dil raju

More Telugu News