Petrol: మరింతగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధర!

  • ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గుతున్న ధరలు
  • లీటరు పెట్రోలుపై 41 పైసల తగ్గింపు
  • 30 పైసలు తగ్గిన డీజిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో ఇండియాలోనూ ఆ ప్రభావం కనిపించింది. గురువారం నాడు లీటరు పెట్రోలుపై 41 పైసలు, డీజిల్ పై 30 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ధర మార్పు తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 75.97కు, డీజిల్ ధర రూ. 70.97కు దిగివచ్చింది.

ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 81.50గా, డీజిల్ ధర రూ. 64.34గా ఉంది. కోల్ కతా, చెన్నైల్లో పెట్రోలు ధర వరుసగా రూ. 77.93, రూ. 78.88కి చేరుకోగా, డీజిల్ ధర వరుసగా రూ. 72.82, రూ. 74.99కి తగ్గింది. మంగళవారం, బుధవారాల్లో ధరలను సవరించలేదన్న సంగతి తెలిసిందే. ఇరాన్ పై విధించిన ఆంక్షలను అమెరికా సడలించిన నేపథ్యంలోనే క్రూడాయిల్ ధరలపై ఒత్తిడి నెలకొందని చమురు రంగ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

More Telugu News