EVM: ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,400 మంది ఓటర్లు మాత్రమే... కారణమిదే!

  • ఈ ఎన్నికల్లో ఈవీఎంలకు అనుబంధంగా వీవీ ప్యాట్ లు
  • ఓటేసిన పార్టీ గుర్తును చూపించే వీవీ ప్యాట్
  • 1,500 స్లిప్పుల వరకూ మాత్రమే థర్మల్ పేపర్

ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1,400 మందికన్నా అధిక ఓటర్లు ఉండటానికి వీల్లేదు. తెలంగాణకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అమలులోకి వచ్చిన తాజా నిబంధన ఇది. దీనికి కారణం ఏంటో తెలుసా?

ఈ ఎన్నికల్లో ఈవీఎంలకు వీవీ ప్యాట్ కూడా అనుసంధానమై ఉంటుందని తెలుసుగా? మనం ఎవరికి ఓటు వేశామన్నది వీవీ ప్యాట్ లో కనిపిస్తుంది. ఇందులోని థర్మల్ పేపర్, ఓటు పడిన గుర్తును చూపించి, ఆపై దాన్ని అందులోనే వేసేస్తుంది. వీవీ ప్యాట్ లో అమర్చిన థర్మల్ పేపర్, 1500 ఓట్ స్లిప్పుల ముద్రణకు మాత్రమే సరిపోతుంది. వీటిలో ఓ 100 స్లిప్పుల వరకూ నమూనా పోలింగ్ ప్రక్రియ క్రమంలో ఖర్చయిపోతాయి. అందువల్లే ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 1,400 మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉండకుండా చూశారు అధికారులు.

More Telugu News