paruchuri: మమ్మల్ని తిట్టిన అల్లు రామలింగయ్య గారే ఫోన్ చేసి అభినందించారు: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ఈ చరిత్ర ఏ సిరాతో' రాశాను 
  • అల్లు రామలింగయ్య ఫోన్ చేశారు 
  • ఆయనని 'బాబాయ్' అని పిలిచేవాడిని    

సినీ రచయితగా ఎన్నో విజయవంతమైన సినిమాలకి పనిచేసిన పరుచూరి గోపాలకృష్ణ, తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "మేము కెరియర్ ను ఆరంభించిన తొలి రోజులలో 'బూతులు రాసే రచయితలు వచ్చారు' అని అల్లు రామలింగయ్య గారు మమ్మల్ని తిట్టారు. అలాంటి రామలింగయ్య గారు ఒకరోజు రాత్రి నాకు ఫోన్ చేశారు.

ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఉండేవి కాదు గదా .. ట్రంకాల్ బుక్ చేసి మాట్లాడవలసి వచ్చేది. ఫోన్ చేసి 'ఎవరూ పరుచూరి గోపాలకృష్ణేనా?' అని అడిగారు. నేను 'అవునండి' అన్నాను. 'అనురాగ దేవత' రాసినవాడివేనా?' అని అడిగారు. నేను 'అవునండి' అని చెప్పాను. ''ఈ చరిత్ర ఏ సిరాతో' సినిమాకి మాటలు 'పరుచూరి గోపాలకృష్ణ' అని పడింది .. అది నువ్వేనా?' అని అడిగితే 'అవునండి' అన్నాను. 'ఎంత గొప్పగా రాశావయ్యా' అంటూ ఆయన తనదైన శైలిలో అభినందించారు. అప్పటి నుంచి నేను ఆయనని 'బాబాయ్' అని ప్రేమతో పిలిచేవాడిని' అని చెప్పుకొచ్చారు.   

More Telugu News