Congress: కాంగ్రెస్, కూటమి నేతలకు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి విజ్ఞప్తి

  • రెబెల్ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాలి
  • మహాకూటమి స్ఫూర్తిని దెబ్బతీయొద్దు
  • టికెట్ దక్కని నాయకులకు స్పష్టత నివ్వాలి 
కాంగ్రెస్ పార్టీ, మహాకూటమి నేతలకు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఓ విజ్ఞప్తి చేశారు. మహాకూటమి స్ఫూర్తిని దెబ్బతీయొద్దని, తక్షణమే భాగస్వామ్య పక్షాలన్నీ తమ పార్టీలకు చెందిన రెబెల్ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాలని కోరారు. టికెట్ దక్కకపోవడంతో ఆందోళన చెందుతున్న ఆయా పార్టీల కార్యకర్తలకు స్పష్టత ఇవ్వాలని ఆమె సూచించారు.

ఇదిలా ఉండగా, మహాకూటమి ద్వారా స్నేహపూర్వక పోటీకి దిగనున్న తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి సీట్లు సర్దుబాటు కాకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయశాంతికి కోదండరామ్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కామన్ మినిమ్ ప్రోగ్రాం, సీట్ల సర్దుబాటుపై చర్చించినట్టు సమాచారం.  
Congress
mahakutami
star campaigner
vijayashanti

More Telugu News