Badal: ఢిల్లీలో వరుడిపై కాల్పులు.. భుజంలోకి దూసుకెళ్లిన తూటాతోనే వివాహం!

  • వివాహ వేదిక వద్దకు వస్తుండగా కాల్పులు
  • వరుడి కుడిభుజంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
  • తాళి కట్టిన అనంతరం ఆసుపత్రికి వెళ్లిన వరుడు
భుజంలో బుల్లెట్ తగలడంతో పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అయినా కూడా ఆ గాయంతోనే పెళ్లి కూతురి మెడలో తాళి కట్టిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ కథనం మేరకు.. దక్షిణ ఢిల్లీలోని మదన్ గిరి ప్రాంతంలో సోమవారం రాత్రి వరుడు బాదల్(25) ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో వరుడి కుడిభుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అది రెండు ఎముకల మధ్య ఇరుక్కోవడంతో తీయడం చాలా కష్టమైంది. వైద్యులు శస్త్ర చికిత్స చేసేందుకు మూడు గంటలు పడుతుందని చెప్పడంతో, పెళ్లి మండపానికి వచ్చి వధువు మెడలో తాళి కట్టిన అనంతరం వెళ్లి ఆసుపత్రిలో చేరాడు. అయితే తనపై కాల్పులు జరిపిందెవరో తెలియదని బాదల్... పోలీసులకు తెలిపాడు. 
Badal
Delhi
Deputy commissioner
Vijay Kumar

More Telugu News