L. Ramana: టీడీపీ తెలంగాణ అధ్యక్షుడి సమక్షంలో కార్యకర్తల మధ్య ఘర్షణ

  • దీపక్ రెడ్డి, బీఎన్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ
  • ఘర్షణకు దారి తీసిన మాటల యుద్ధం
  • ఇరు వర్గాల మధ్య తోపులాట
  • పరిస్థితిని అదుపు చేసిన రమణ
టికెట్ దక్కించుకున్న నేతలు, టికెట్ రాక భంగపడ్డ నేతలకు చెందిన ఇరు వర్గాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే బాహాబాహాకి పాల్పడ్డాయి. నేడు టీడీపీ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. నేడు ఖైరతాబాద్ కార్యకర్తలతో రమణ టీడీపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటిలో దీపక్ రెడ్డి, బీఎన్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన మాటల యుద్ధం ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటలతో పరిస్థితి అదుపు తప్పడంతో రమణ కల్పించుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపు చేశారు.
L. Ramana
Telugudesam
Deepak Reddy
BN Reddy
Khairathabad

More Telugu News