Uttar Pradesh: మంచినీటి కోసం వెళ్లిన బాలికపై అత్యాచారం చేసి.. వీడియో తీశారు!

  • 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. ఆపై అత్యాచారం
  • వీడియో తీసిన మరో యువకుడు
  • ఇద్దరిపై బాధితురాలి సోదరుడి ఫిర్యాదు
మంచినీటి కోసం చేతిపంపు దగ్గరకు వెళ్లిన తన సోదరిని కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి సోదరుడు భోపా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీపీ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సింగ్ కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక సోమవారం నీళ్ల కోసం దగ్గరలోని చేతిపంపు దగ్గరకు వెళ్లింది.

ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడమే కాకుండా ఆ పైశాచికత్వాన్నంతా మరో యువకుడి చేత వీడియో తీయించాడు. ఈ మేరకు సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీడియో తీసిన యువకుడిపై కూడా కేసు నమోదు చేశారు.
Uttar Pradesh
16 Years Girl
Kidnap
VP Singh
Police

More Telugu News