sensex: మూడు రోజుల లాభాలకు బ్రేక్.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

  • దేశీయ మార్కెట్లపై ఆసియా మార్కెట్ల ప్రభావం
  • 107 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 6 శాతం పైగా నష్టపోయిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల పాటు కొనసాగిన జోరుకు నేడు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లన్నీ ఈరోజు బలహీనంగా ఉండటం మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయి 35,474కు పడిపోయింది. నిఫ్టీ 107 పాయింట్లు పతనమై 10,656కు దిగజారింది.

టాప్ గెయినర్స్:
పేజ్ ఇండస్ట్రీస్ (4.02), వెల్స్ పన్ కార్పొరేషన్ (3.86), జస్ట్ డయల్ (3.83), బీఈఎంఎల్ (3.56), క్వాలిటీ (3.54).

టాప్ లూజర్స్:
మిండా ఇండస్ట్రీస్ (6.51), యస్ బ్యాంక్ (6.10), ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (5.93), బ్లూ స్టార్ (5.91), జైన్ ఇరిగేషన్ (5.79).    

More Telugu News