BSE sensex: లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగిన మదుపరులు  
  • సెన్సెక్స్ 317 పాయింట్ల లాభం 
  • 81 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 

స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈ రోజు మార్కెట్లు ఓపెన్ అయిన దగ్గర నుంచీ లాభాలతోనే కొనసాగాయి. మదుపుదారులు ఉత్సాహంగా కొనుగోళ్లకు దిగడంతో చివరికి సెన్సెక్స్ 317 పాయింట్ల లాభంతో 35775 వద్ద, 81 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10763 వద్ద ముగిశాయి. నేడు ఆర్బీఐ బోర్డు పలు విషయాలపై చర్చించడానికి ప్రభుత్వంతో సమావేశమైన నేపథ్యంలో మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడాయి.

ఈ క్రమంలో టాటామోటార్స్, సన్ ఫార్మా, ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ తదితర షేర్లు లాభాలు పండించుకున్నాయి. ఇక బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియా బుల్స్, ఓఎన్జీసీ, గెయిల్ తదితర కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి.     

More Telugu News