Narendra Modi: మోదీ చాయ్‌వాలా కాదు... కార్పొరేట్‌ వాలా: మంత్రి యనమల రామకృష్ణుడు

  • దేశంలో ఆయన వల్ల రాజకీయ కాలుష్యం పెరిగి పోయింది
  • ఈ కాలుష్యాన్ని కడిగేసేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలి
  • సీబీఐని అడ్డుకుంటూ 'సమ్మతి' ఉత్తర్వుల ఉపసంహరణ వంద శాతం కరెక్టని స్పష్టీకరణ

దేశ ప్రధాని నరేంద్రమోదీ పేరుకే చాయ్‌వాలా అని, వాస్తవానికి ఆయన కార్పొరేట్‌ వాలా అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో రాజకీయ కాలుష్యం పెరిగిపోయిందన్నారు. ఇది ఢిల్లీ రాష్ట్రాన్ని పీడిస్తున్న కాలుష్యం కంటే ప్రమాదకరంగా మారిందన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మోదీ రాజకీయ కాలుష్యాన్ని కడిగేసేందుకు బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతర్గత విభేదాలతో అప్రతిష్టపాలైన సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిరోధిస్తూ 'సమ్మతి' ఉత్తర్వుల ఉపసంహరణ వంద శాతం సరైన చర్యని సమర్థించుకున్నారు.

 ఈ అంశంపై అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ రాష్ట్రాలకు సార్వబౌమాధికారం లేదని వ్యాఖ్యానించడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. రాఫెల్‌పై కాగ్‌ నివేదికను పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదో అరుణ్‌ జైట్లీ చెప్పాలని కోరారు. సుప్రీంకోర్టు వద్ద రహస్యాలు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ ప్రసాద్‌యాదవ్‌ను కావాలని ఇరికించారని ఆరోపించారు.

More Telugu News