ఓయూ నుంచి విద్యార్థి నేత... తుది జాబితా ప్రకటించిన తెజస!
Add ap7am to your home Screen

ఓయూ నుంచి విద్యార్థి నేత... తుది జాబితా ప్రకటించిన తెజస!

  • మరో ఇద్దరిని ప్రకటించిన కోదండరామ్
  • మొత్తం 14 స్థానాల్లో అభ్యర్థులకు బీఫారాలు
  • వర్ధన్నపేటకు దేవయ్య, అంబర్ పేటకు నిజన రమేశ్
మహాకూటమిలో భాగంగా 8 స్థానాలను తీసుకున్న తెలంగాణ జనసమితి 14 స్థానాల్లో నామినేషన్ వేయాలని నిర్ణయించుకుంది. తాజాగా తుది జాబితాను ప్రకటిస్తూ, వర్ధన్నపేట నుంచి పగిటిపాటి దేవయ్యను, అంబర్ పేట నుంచి ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నేత నిజన రమేశ్ లను బరిలోకి దింపింది. వీరిద్దరికీ తెజస అధినేత కోదండరామ్ బీఫారాలను అందించారు. తమకు ఇచ్చిన స్థానాలతో పాటు మెదక్, సిద్ధి పేట, దుబ్బాక, మల్కాజిగిరి, వరంగల్ తూర్పు, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ స్థానాల్లో కోదండరామ్ అభ్యర్థులను ప్రకటించారు. మహబూబ్ నగర్ స్థానంలో టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించగా, మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆర్.కృష్ణయ్యను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.
Kodandaram
Telangana
Mahakutami

More Telugu News