kothagudem: చంద్రబాబుతో భేటీ అయిన టీటీడీపీ నేత కోనేరు చిన్ని

  • కొత్తగూడెం టికెట్ ను ఆశించిన కోనేరు చిన్ని
  • కూటమిలో భాగంగా కొత్తగూడెం స్థానం కాంగ్రెస్ కు కేటాయింపు
  • రానున్న రోజుల్లో మంచి అవకాశం కల్పిస్తానంటూ చంద్రబాబు హామీ

తెలంగాణ టీడీపీ నేత కోనేరు చిన్ని అమరావతిలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం నుంచి చిన్ని టీడీపీ టికెట్ ను ఆశించారు. అయితే, మహాకూటమి పొత్తులో భాగంగా... ఆ స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించారు. వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, మహాకూటమి అధికారంలోకి రాబోతోందని... రానున్న రోజుల్లో మంచి అవకాశాన్ని కల్పిస్తానని చిన్నికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News