Irramore: తప్పనిసరై 'భైరవగీత'లో ఆ సన్నివేశాల్లో నటించా: హీరోయిన్ ఇర్రా మోర్

  • భైరవగీతలో లిప్ లాక్ సీన్లు
  • అలా నటించడం ఇష్టం లేదు
  • బాధ్యతగల హీరోయిన్ గా నటించానంతేనన్న ఇర్రా

ఈ నెల 30న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానున్న 'భైరవగీత' చిత్రం ట్రయిలర్, యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా, ఈ సినిమాలో శ్రుతిమించిన శృంగారం, లిప్ లాక్ సీన్లపై హీరోయిన్ ఇర్రా మోర్ స్పందించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను ఈ సీన్లను చేశానని అంది. ఈ సినిమా కథ ప్రకారం, ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను బలంగా చెప్పేందుకు ముద్దు సీన్లు తప్పవని, వందమంది చూస్తుండగా, అలా చేయడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పింది. తనకు లిప్ లాక్ సీన్లలో నటించడం ఇష్టం లేకున్నా, ఓ నటిగా, అది తన బాధ్యతగా భావించి చేశానని అంది. కాగా, ధనుంజయ్ హీరోగా నటిస్తున్న సినిమా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News